I met my soulmate again.. Charmi interesting post

Charmi: హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను బాగా కట్టుకుంది. ‘నీతోడు’ కావాలి అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఛార్మి కౌర్. 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఎన్నో సినిమాస్ చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

తమిళంతో తెలుగులో కూడా వరస మూవీస్ చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేసేది. ఇక లాస్ట్ గా 2013 లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘ సేవకుడు’ చిత్రంలో కనిపించిన ఛార్మి..అప్పటినుంచి వెండితెరకు దూరమైంది. తరువాత 2022 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ లైగర్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలవటంతో కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అయింది. అయినా ఏ మాత్రం తగ్గని హీరోయిన్..ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబల్ ఇస్మార్ట్’ కు కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంది.

‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు దీని సీక్విల్ పై వస్తున్న ‘ డబల్ ఇస్మార్ట్’ పై డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్ స్టా వేదికగా ఛార్మి ఓ పోస్ట్ పెట్టింది. ‘నా ఆద్మీయుడితో మళ్లీ కలిశారు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఇందులో హీరోయిన్ తన కంటే పెద్ద సైజ్ లో ఉన్న కుక్కతో ఉన్న ఫోటో షేర్ చేయడంతో..డాగ్ సైజ్ ను చూసి షాక్ అవుతున్నారు నెటిజెన్లు. చార్మి దిగిన ఫోటో లో డాగ్ ని ముద్దు పెడుతున్నట్టు ఉంది. అలాగే ఛార్మి నైట్ వేర్ డ్రెస్ లో ఉంది. ఛార్మి ఈ ఫోటోలో చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.