Heroine: పై ఫోటోలో ఉన్న అందమైన అమ్మాయిని గుర్తించారా? స్కూల్ డ్రెస్ లో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా తయారయ్యిందో తెలుసా? క్రేజీ హీరోయిన్‌గా ఇండియా మొత్తం ఫేమస్ అయింది. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది. అయితే ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.  తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినా ఆమె తన అందాలతో ముద్ర వేసుకుని అందరికి గుర్తుండిపోయింది. తన అందం, అభినయంతో అభిమానుల మనసు దోచుకున్న ఈ బాలీవుడ్ భామ ఆ తర్వాత హిందీలోకి వెళ్లి అక్కడ సినిమాలతో హిట్ కొట్టి అక్కడే స్థిరపడింది.

Heroine Disha Patani Old days Photo in Social media

స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే చాలా ఏళ్ల త‌ర్వాత ఈ అందాల తార మ‌ళ్లీ తెలుగు సినిమా లో నటించింది. పాన్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన తాజా సూపర్ హిట్  సినిమాలో ఆమె నటించింది. దీన్ని బట్టి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. అవును ఆ అమ్మాయే.. ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ జోడిగా నటించిని ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ దిశా పటానీ ఫోటో నే పైన కనిపించిన ఫోటో. ఇది ఆమె పాఠశాల సమయంలో తీసిన ఫోటో.

Also Read: Team India: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్… 2027 వరల్డ్‌కప్‌ నుంచి అవుట్ .?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దిశా పటాని. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడే స్థిరపడింది. ఇటీవల ఆమె పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. దిశా పటాని రాక్సీ పాత్రలో కొంచెమే కనిపించినప్పటికీ, సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. సినిమాలలో తన అందాలతో పిచ్చెక్కిస్తున్న ఈ సుందరి ఇటీవల తన టాటూతో అబ్బాయిలను పిచ్చెక్కిస్తోంది. కల్కి సినిమా విడుదల సమయంలో దిశా తన చేతిపై పీడీ టాటూ వేయించుకోవడం పెద్ద అలజడిని సృష్టించింది.

ఇదే కాదు ఆమె నడుము మీద మరొక టాటూ కనిపించింది, ఏదో అర్థం కాని భాష. ఇజ్రాయెలీ పచ్చబొట్లు ఆసియా మరియు ఆఫ్రికా మధ్య కొన్ని దేశాలలో ఉపయోగించే హిబ్రూ భాష అంటున్నారు. మొత్తానికి కల్కి సినిమా కంటే ఎక్కువగా తన టాటూ ద్వారా వార్తల్లో నిలుస్తోంది దిశా పటానీ. ఇక సోషల్ మీడియా లో ఆమె పెట్టె పోస్ట్ లు ఫోటోలు అందరిని ఏ స్థాయిలో పిచ్చేక్కిస్తున్నాయో అందరికి తెలిసిందే.