Team India: ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఫిట్ గానే ఉన్నారు. ఇద్దరికీ మూడు ఫార్మాట్లలో ఆడేటువంటి స్టామినా ఉంది. కానీ ఇటీవలే అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. వన్డేలు, టెస్టుల్లోనే కొనసాగుతామని ప్రకటించేశారు. టీమిండియా తరఫున రెండు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్ లోను ఆడబోతున్నారు. అయితే వన్డేలు, టెస్టుల్లోను ఎంతకాలం ఆడుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎంత గొప్ప ప్లేయర్ అయినా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే. ఫిట్ గా ఫామ్ లో ఉన్నంతవరకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఒక్కసారి ఫామ్ కోల్పోతే విమర్శల దాడి పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు కోహ్లీ, రోహిత్ బాగానే ఆడుతున్నారు. కుర్రాళ్లను మించి ఆడుతున్నారు. అనుభవంతో భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. Team India

Rohit, Kohli Retirement Out of 2027 World Cup

ఫైనల్లో 76 పరుగులతో విరాట్ తన స్టామినా చూపించాడు. అయితే ఒక్కో ఫార్మాట్ కు బై చెప్పడానికి టీ20 వరల్డ్ కప్ విజయానికి మించిన సందర్భం ఉండదనుకున్నారు. ఇలా వరల్డ్ కప్ గెలవగానే అలా అంతర్జాతీయ టీ20లకు సెలవు ప్రకటించారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలిసారి వరల్డ్ కప్ ను ముద్దాడాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోను సభ్యుడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అప్పట్లో సీనియర్లతో కలిసి విజయాన్ని ఆస్వాదించాడు. కోహ్లీ, రోహిత్ మాత్రం కలిసి తొలిసారి 2024 లోని వరల్డ్ కప్ ను ముద్దాడాడు. టీ20 వరల్డ్ కప్ లోను ఇద్దరు కలిసి అందుకున్నారు. అలానే వన్డే వరల్డ్ కప్ ను కూడా అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరం కావాలని అనుకుంటున్నారు. Team India

Also Read: Potatoes: మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా..? అయితే జాగ్రత్త!

నిజానికి వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉంది. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. అప్పటివరకు రోహిత్ వయస్సు 40 సంవత్సరాలు అవుతుంది. విరాట్ కోహ్లీ 38వ సంవత్సరంలో అడుగుపెడతాడు. అప్పటికి ఇద్దరి ఫామ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఫామ్, ఫిట్నెస్ ఉంటే టీమిండియాకు అడ్వాంటేజ్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కానీ స్టార్ ప్లేయర్లు జట్టును పట్టుకొని వేలాడే టైప్ కాదనే చర్చ కూడా జరుగుతుంది. ఆటను ఎప్పుడు ముగించాలన్న దానిపై ఇద్దరికీ క్లారిటీ ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఆడినంతకాలం ఆడించాలని అంటున్నారు. Team India

రిటైర్మెంట్ పై నిర్ణయాన్ని కోహ్లీ, రోహిత్ కి వదిలేయాలని అంటున్నారు. అయితే ఇప్పటి స్టార్ ప్లేయర్ల ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ. 2013 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ అందుకోలేదు. 11 ఏళ్ల నిరీక్షణకు తెరపడేలా కోహ్లీ, రోహిత్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఊరిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను అందుకోవాలని అనుకుంటున్నారు. ఇక మరికొంత కాలం ఆడాలని ఉందంటూ ఇటీవలే రోహిత్ చెప్పాడు. కోహ్లీలో కూడా ఆట మిగిలిపోయే ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత సీనియర్ల కెరియర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.Team India