Star Hero Hrithik Roshan Marriage soon

Hrithik Roshan: తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. త్వరలో యువ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటాడని బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఏ వార్త తెగ హల్చల్ అవుతుంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకెళితే.. తన మొదటి భార్యతో విడిపోయిన తర్వాత హృతిక్ రోషన్ యంగ్ బ్యూటీ  షాబా ఆజాద్‌ తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసిన విహారయాత్రలు, పార్టీలు కలిసి తిరిగి అందరిని తెగ ఆశ్చర్య పరిచారు. 

Star Hero Hrithik Roshan Marriage soon

ఇప్పుడు ఈ జంట తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల షాబా ఆజాద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో “రివీలింగ్ సూన్” అంటూ ఆసక్తికరమైన పోస్ట్‌ను పోస్ట్ చేసింది. దీనిపై హృతిక్ రోషన్ కూడా స్పందించాడు. ‘నేను ఆగలేను’ అంటూ ఓ క్రేజీ కామెంట్‌ను పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఈ ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోబోతున్నారని విపరీతంగా చర్చించారు. అయితే ఈ ప్రేమ జంట నిజంగా పెళ్లి చేసుకుంటారా? లేదా ఏదైనా సినిమా స్టంట్? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Team India: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్… 2027 వరల్డ్‌కప్‌ నుంచి అవుట్ .?

క్రిష్ సినిమా ద్వారా హృతిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిచాడు.. ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి war 2 చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాలే కాకుండా మరిన్ని సినిమాలను కూడా హృతిక్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. హృతిక్ 2000లో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్‌ను కూడా వివాహం చేసుకున్నాడు. వీరికి హ్రీహాన్,  హ్రిధాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 2014లో హృతిక్, సుసానే విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత సుస్సానే ఖాన్ మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది. హృతిక్ కూడా షబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు.ఏదేమైనా వీరి వివాహం అనేది ఇప్పుడు బీ టౌన్ లో ఫుల్ వైరల్ అవుతుంది.