సునీల్ హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్న సినిమా హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ అయ్యింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2 అల్ట్రా ఫ్లాప్ మూవీగా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. రొటీన్ కథా కథనాలు, మూస కామెడీతో ఈ సినిమా బోర్ కొట్టించిందనే టాక్ వస్తోంది.
ఒకవైపు సయ్యారా వంటి కొత్త నటీనటుల సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్ తో చేసిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద తేలిపోతోంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, రవి కిషన్, సంజయ్ మిశ్రా తదితరులు నటించారు. దేవగణ్ ఫిలింస్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు.




















