నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న వారు తమ రెస్పాన్స్ తెలియజేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.
థియేటర్స్ లో సినిమాను మిస్ అయిన వారు తమ్ముడు మూవీ నెట్ ఫ్లిక్స్ లో చూస్తూ స్టోరీ, స్క్రీన్ ప్లే, నెరేషన్ బాగున్నాయంటూ చెబుతున్నారు. గత నెల 4వ తేదీన తమ్ముడు సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంగా మంచి థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ వేణు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో లయ నితిన్ సోదరిగా కనిపించింది.




















