రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న బేబి సినిమా టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బేబి సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెలవడం సంతోషంగా ఉందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేశ్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అవార్డ్ రావడం, ఆయనకు దక్కిన సరైన గౌరవం అని అల్లు అర్జున్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. సాయి రాజేశ్ మరిన్ని అవార్డ్స్ గెల్చుకోవాలని అల్లు అర్జున్ కోరారు. అలాగే సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ కు కూడా విశెస్ అందించారు.
అల్లు అర్జున్ గతేడాది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు డిఫరెంట్ రోల్స్ చేస్తుండటం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.




















