విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వెళ్తోంది. మలయాళ ఇండస్ట్రీలో ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సర్ ప్రైజ్ చేసింది. నాన్ మలయాళ వెర్షన్ లో ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా కింగ్డమ్ నిలిచింది. కింగ్డమ్ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో ఏర్పడిన క్రేజ్ కు మలయాళంలో క్రియేట్ చేసిన రికార్డే ప్రూఫ్ గా చెప్పుకోవచ్చు.
అర్జున్ రెడ్డి సినిమా టైమ్ నుంచే విజయ్ దేవరకొండకు మలయాళంలోనూ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత విజయ్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నం ఇప్పుడు కింగ్డమ్ వసూళ్ల మీద పాజిటివ్ గా ఇంపాక్ట్ చూపించింది. మలయాళ బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ ఫస్ట్ వీక్ మరిన్ని భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.




















