న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ఆహా

ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఆహా. ఆహా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమలో అవకాశాల పొందారు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3 పోటీదారులు నజీర్, భరత్ రాజ్ త్వరలో రాబోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలోని పాటకు తమ గాత్రాన్ని అందించారు

తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహిరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సీజన్ 3 వేదికగా నజీర్, భరత్ రాజ్ అవకాశం ఇస్తానని మాటిచ్చారు. తన మాటను నిలబెట్టుకుంటూ తమన్ ఓజీ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ఫైర్ స్ట్రామ్ పాటలో అవకాశం కల్పించారు. ఓజీ ఫైర్ స్ట్రామ్ పాట ఛాట్ బస్టర్ అయ్యింది. మరోవైపు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ కు యూఎస్ లో ఆడిషన్స్ పూర్తి కాగా..మన ఆడిషన్స్ కొనసాగుతున్నాయి. ఆడిషన్స్ లో ఎంపికైన సింగర్స్ గోల్డెన్ టికెట్ పోటీపడనున్నారు.