గ్లామర్ తో ప్రేక్షకుల్ని కట్టేయడంలో మాళవిక మోహనన్ తన ప్రత్యేకత చూపిస్తుంటుంది. ఈ భామ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కాబోతోంది. పేట, మాస్టర్, తంగలాన్ వంటి తమిళ డబ్బింగ్ మూవీస్ తో మాళవిక మన ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాజా సాబ్ తో ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో విషెస్ అందించారు రాజా సాబ్ మేకర్స్. ఈ పోస్టర్ లో వెన్నెల్లో జాబిలిల్లా చీరకట్టులో ఆకట్టుకుంటోంది మాళవిక.
ఈ సినిమాలో మాళవిక క్యారెక్టర్ గ్లామర్, పర్ ఫార్మెన్స్ కలిసి ఉండబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన రాజా సాబ్ టీజర్ లోనూ మాళవిక స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. రాజా సాబ్ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. రాజా సాబ్ సినిమాతో త్వరలోనే థియేటర్స్ లో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి.




















