హీరో మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమాను దర్శకుడు హనుమ రెడ్డి యెక్కంటి రూపొందించనున్నారు. బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంతో డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మంచు మనోజ్ ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ 21 ఏళ్లుగా తన కెరీర్ కొనసాగుతోందని, ఇన్నేళ్లుగా తనకు నచ్చిన ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగడం హ్యాపీగా ఉందని చెప్పారు. ఇంటెన్స్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా డేవిడ్ రెడ్డి ఉంటుందని మనోజ్ తెలిపారు. ఈ టైటిల్ పోస్టర్ లో – మద్రాసులో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని షేక్ చేస్తున్నాడు అనే క్యాప్షన్ రాశారు. ఇది కాకుండా వాట్ ది ఫిష్ అనే మరో చిత్రంలోనూ మనోజ్ నటిస్తున్నాడు.




















