టాలీవుడ్ నుంచి మరో ప్రెస్టీజియస్ ఫిల్మ్ రాజా సాబ్ ను నిర్మిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. రాజా సాబ్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో విశ్వప్రసాద్ చెప్పిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి.
ఈ ఇంటర్వ్యూస్ లో రాజాసాబ్ సీక్వెల్ ఉంటుందని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. రాజా సాబ్ కథకు కొనసాగింపుగా ఉండదని, కొత్త కథతో రాజా సాబ్ ప్రపంచాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. రాజా సాబ్ సినిమాకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్, సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తయ్యిందని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. అక్టోబర్ చివరికల్లా ఈ సినిమా కంప్లీట్ అవుతుందని ఆయన తెలిపారు. రాజా సాబ్ సీక్వెల్ ఉంటుందని ప్రొడ్యూసర్ చెప్పడం రెబల్ ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తోంది.




















