ఈ సారి సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి అందరి కంటే ముందుగా వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన చిత్రం మెగా 157. ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి జంటగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతోన్న మూవీ, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, కోలీవుడ్ స్టార్ విజయ్ జన నాయగన్ ఈ నాలుగు సినిమాలు వస్తాయని వార్తలు వచ్చాయి.
పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుందట. అయితే మెగా 157 మూవీ మాత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు లేటేస్ట్ అప్డేట్ తెలుస్తోంది. ఇక బాలకృష్ణ అఖండ 2 డిసెంబర్ లో కుదరకపోతే సంక్రాంతికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయని తెలిసింది. మొత్తానికి రానున్న సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఏర్పడనుంది.




















