ప్రీమియర్స్ తో “వార్ 2″కు నష్టమేనా?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ నెల 14న వార్ 2 భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఉదయం 4 గంటలకే ప్రీమియర్స్ ఉండచ్చని డిస్ట్రిబ్యూటర్స్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్‌ వేసేందుకు ప్రభుత్వాలు అనుమతించడం లేదు. అయితే వార్ 2 మూవీ ప్రీమియర్స్ కోసం నిర్మాత నాగవంశీ ప్రయత్నిస్తున్నారు.

హరి హర వీరమల్లు, గేమ్ ఛేంజర్ సినిమాలకు ఈ ప్రీమియర్స్ వ్యూహం పని చేయలేదు, కంటెంట్ బాగుంటే ప్రీమియర్స్ వేస్తే ప్లస్ అవుతుంది. అదే కంటెంట్ బాగాలేకపోతే ప్రీమియర్స్ వేస్తే మైనస్ అవుతుంది. అయితే వార్ 2లో ఎన్టీఆర్ నటించినప్పటికీ, ఇది ఇప్పటికీ బాలీవుడ్ చిత్రమే అనే ఫీలింగ్ పోవడం లేదు. తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ వెర్షన్‌ను చూస్తారు. బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అందరికి కనెక్ట్ కాకపోవచ్చు. ఏమాత్రం యావరేజ్ అనే టాక్ వచ్చినా ప్రీమియర్స్ వల్ల నష్టమే జరుగే అవకాశాలు కనిపిస్తున్నాయి.