రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్ యాడ్ చేయబోతున్నారు.
ఈ పాట శ్రీకాకుళం యాసలో ఉంటుందని, ఫోక్ సింగర్ పెంచల దాస్ పాడినట్టు సమాచారం. అందరికీ మాంచి కిక్ ఇచ్చేలా ఈ పాటను దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేశాడు. ఈ పాటలో పూజా హేగ్డేను తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పూజా కాదు..సమంతను ఈ పాటకు సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో కలిసి సమంత రంగస్థలం సినిమాలో నటించింది. ఇప్పుడు పెద్దిలో స్పెషల్ సాంగ్ చేయనుండటం ఆసక్తి కలిగిస్తోంది.




















