ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో వెనకబడిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తో స్పీడు పెంచింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనే డౌట్స్ వచ్చాయి. మేకర్స్ చెప్పలేదు కానీ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. త్రివిక్రమ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ దృష్టిలో హృతిక్ విలన్ అని హృతిక్ దృష్టిలో ఎన్టీఆర్ విలన్ అని అని చెప్పారు.
ఇద్దరిలో మంచి చెడు ఉంటాయని అయితే ఎవరు మంచి ఎవరు చెడు అనేది సినిమాలో చూడాలన్నారు. ఇక డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అయితే ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ హీరోలే అని అన్నాడు. ఈ విధంగా ఈ ఇద్దరి క్యారెక్టర్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ గురించి హృతిక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ను చూసి చాలా నేర్చుకున్నానని..తన తర్వాత చిత్రాల్లో వాటిని అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. ఎన్టీఆర్ కూడా హృతిక్ తో వర్క్ చేస్తూ ఎంతో నేర్చుకున్నాను అని చెప్పాడు. దీనిని బట్టి వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందని అర్థమవుతోంది. ఈ నెల 14న వార్ 2 థియేటర్స్ లోకి రాబోతోంది.




















