పవన్ కొత్త సినిమాలు ఒప్పుకుంటాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓజీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్ లోకి వస్తోంది. ఇక పవన్ మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్‌ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కొంత ప్యాచ్ వర్క్ చేస్తే మొత్తం షూటింగ్ పూర్తయినట్టే.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. త్వరలోనే రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారని సమాచారం. ఓజీ, ఉస్తాద్ తర్వాత పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో నటిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల ముందు ఒకటి లేదా రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ ఉందని తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక సినిమా, ఎస్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్స్ సురేందర్ రెడ్డి కాంబోలో మరో సినిమా పవన్ చేయాల్సిఉంది.