డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో సినిమా అని ప్రకటించినప్పటి నుంచి అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక సీనియర్ హీరోయిన్ టబు ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా కన్ పర్మ్ చేయలేదు. ఈ సినిమాని జూన్ లో స్టార్ట్ చేశారు. పూరి సంగతి తెలిసిందే కదా.. షూటింగ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే..స్పీడ్ గా తీసేస్తుంటాడు.
ఈ సినిమాని కూడా తనదైన స్టైల్ లో చాలా స్పీడుగా తీస్తున్నాడట. స్పీడ్ ఓకే గానీ క్వాలిటీ సంగతేంటో చూడాలనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్, చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని ఉండే కంటెంట్ పై పెద్ద చర్చే జరిగేలా ఉంటుందట. ముఖ్యంగా సోసైటీ గురించి పాలిటిక్స్ గురించి తనదైన కోణంలో పూరి చూపింబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో ఈసారి సక్సెస్ అందుకోవాలని ఈ సినిమా తీస్తున్నాడు పూరి. ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడట పూరి జగన్నాథ్.




















