“వార్ 2”, “కూలీ” టికెట్ రేట్లపై రచ్చ

రేపు రెండు భారీ చిత్రాలు వార్ 2, కూలీ థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ రెండూ డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. అయినా ఎన్టీఆర్, రజినీ, నాగార్జున, హృతిక్ రోషన్..ఇలాంటి స్టార్స్ ఉన్న సినిమాలు కాబట్టి స్ట్రైట్ చిత్రాలకు వచ్చేంత క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ఇలా ఉంటే కూలీ, వార్ 2 బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.

కూలీ, వార్ 2 రెండూ డబ్బింగ్ సినిమాలు. ఈ డబ్బింగ్ సినిమాలకు కూడా టిక్కెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తమిళ సినిమా అయిన కూలీకి చెన్నైలో రేట్లు తక్కువ. అదే తెలుగులో రేట్లు పెంచితే 450 రూపాయలు అవుతుంది. తెలుగులో రేట్స్ పెంచడంపై బాయ్ కాట్ కూలీ, వార్ 2 అనేది ట్రెండ్ అవుతోంది. ఈ విమర్శల నేపథ్యంలో కూలీ, వార్ 2 సినిమాలకు తెలంగాణలో రేట్లు పెంచడం లేదు. ఏపీలో మాత్రం 50 రూపాయలు, 75రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించారని తెలుస్తోంది.