పలు గేమింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో నటి మంచు లక్ష్మి ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఆమె హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు వెళ్లి తన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు గేమింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి, బ్యాంక్ అక్కౌంట్స్, తీసుకున్న రెమ్యునరేష్ గురించి అడిగినట్లు తెలుస్తోంది.
బ్యాంక్ అక్కౌంట్ డీటెయిల్స్ తీసుకురావాలని ఈడీ అధికారులు మంచు లక్ష్మికి చెప్పినట్లు సమాచారం. సులువుగా డబ్బు సంపాందించేందుకు డిజైన్ చేసిన కొన్ని గేమింగ్ యాప్స్ కు మంచు లక్ష్మి ప్రచారం చేసింది. ఇవి లీగల్ యాప్స్ అవునా కాదా అనేది విచారణలో తేలనుంది. ఈడీ ఆఫీస్ వద్ద మంచు లక్ష్మి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.




















