ఊహించనంతగా “కూలీ” టికెట్ సేల్స్

రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర నటించిన కూలీ సినిమాకు తెలుగు స్టేట్స్ లో ఊహించనంతగా టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు 4 లక్షల టికెట్స్ అమ్ముడయినట్లు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. రేపు కూలీ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. వార్ 2 పోటీని తట్టుకుని కూలీ ఈ రేంజ్ లో టికెట్ సేల్స్ చేసుకోవడం విశేషం.

మరోవైపు ఓవర్ సీస్ లో కూడా కూలీ సినిమాకి టికెట్లు భారీగా సేల్ అవుతున్నాయి. నార్త్ అమెరికారిలో ప్రీమియర్ షోల ద్వారా రికార్డు వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోస్ ప్రీ-సేల్స్‌లో $2 మిలియన్లు అంటే.. దాదాపు 16.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి తమిళ చిత్రంగా రజినీ కూలీ రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో విజయ్ లియో సినిమా 1.8 మిలియన్ డాలర్ సేల్స్ తో సాధించిన రికార్డ్ ను కూలీ దాటేసింది.