హిట్ టాక్ తెచ్చుకోని “వార్ 2”, “కూలీ”

భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చాయి కూలీ, వార్ 2 చిత్రాలు. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పబ్లిక్ టాక్ పరంగా యావరేజ్ గా మారాయి. ఈ రెండు చిత్రాల్లో దేనికీ క్లియర్ గా సూపర్ హిట్ టాక్ రాలేదు. కూలీ, వార్ 2 చిత్రాలు ఓకే అనే విశ్లేషణలు క్రిటిక్స్ నుంచి వస్తున్నాయి. వార్ 2 సినిమాలో యాక్షన్ హంగులు, ఎన్టీఆర్, హృతిక్ ఫేస్ టు ఫేస్ సీన్స్ మాత్రమే బాగున్నాయని, ఎమోషన్ లోపించిందని సినిమా చూసిన వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మేకింగ్ పరంగా గ్రాండియర్ ఆకట్టుకుందని చెబుతున్నారు.

మరోవైపు రజినీకాంత్ కూలీ సినిమా కూడా కొన్ని చోట్ల మాత్రమే మెప్పించిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ దాకా బాగానే ఉన్నా, సెకండాఫ్ లో స్లో అయ్యిందని, హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తేలిపోయిందని, క్లైమాక్స్ కూడా కిక్ రాలేదని చెబుతున్నారు. చాలామంది స్టార్ కాస్టింగ్ ఉన్నా కూలీ మూవీ ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫ్రెండ్ కోసం హీరో ప్రతీకారం తీర్చుకోవడం అనేది మెయిన్ పాయింట్ గా తీసుకుని దర్శకుడు లోకేష్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నాగార్జున క్యారెక్టర్ మాత్రం బాగా ఎలివేట్ అయ్యింది.