పవర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ రెడీ అవుతోంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన రెండు సూపర్ హిట్ చిత్రాలు రిలీజ్ కు రాబోతున్నాయి. తమ్ముడు, జల్సా సినిమాలు సెప్టెంబర్ 2న రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలను థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. తమ్ముడు, జల్సా సినిమాల రీ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

తమ్ముడు సినిమా 99లో థియేటర్స్ లోకి వచ్చింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పుడే మొదలవుతున్న పవన్ స్టార్ డమ్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్లింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన జల్సా 2008లో థియేటర్స్ లోకి వచ్చి భారీ వసూళ్లు సాధించింది. జల్సా పవన్ కు బాక్సాఫీస్ వద్ద కమ్ బ్యాక్ మూవీ అయ్యింది. ఈ రెండు సినిమాలకు పవన్ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది.