హ్యాట్రిక్ జోడీ

హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని నాని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఒక కొత్త తరహా లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతోందట. ఈ మూవీలో నానికి జంటగా ఫిదా బ్యూటీ సాయిపల్లవిని అనుకుంటున్నారట.

నాని, సాయి పల్లవి ఇప్పటికే ఏంసీఏ, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేశారు. ఇది వారికి హ్యాట్రిక్ సినిమా కానుంది. మరోవైపు శేఖర్ కమ్ముల సాయిపల్లవితో ఫిదా అనే సూపర్ హిట్ మూవీ చేశారు. ఈ సినిమాని నిర్మించే నిర్మాత ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. శేఖర్ కమ్ముల ఇటీవలే కుబేరతో హిట్ అందుకోగా..ప్రస్తుతం నాని ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు.