నాగార్జున క్లాసిక్ సీక్వెల్ లో నాగ చైతన్య

నాగ చైతన్య ఏ కొత్త సినిమా ఇంటర్వ్యూ ఇచ్చినా నాగార్జున సినిమాల్లో ఏ చిత్రానికి సీక్వెల్ చేస్తారు, ఏదైనా ఏ సినిమానైనా రీమేక్ చేయాలని అనుకున్నారా అని అడుగుతుంటారు. నాగ చైతన్యకు అలాంటి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన గీతాంజలి సినిమా సీక్వెల్ లో నాగచైతన్య నటించేందుకు రెడీ అవుతున్నారట. దర్శకుడు మణిరత్నం గీతాంజలి 2 సినిమాకు ప్లాన్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాలనే ప్రపోజల్ వచ్చిందట. ఇటీవల థగ్ లైఫ్ వంటి ఫ్లాప్ సినిమా చేశాడు మణిరత్నం. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టితో ఓ లవ్ స్టోరీ రూపొందించాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో గీతాంజలి 2 తెరకెక్కించాలనే సన్నాహాలు చేస్తున్నాడట మణిరత్నం. నాగ చైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడు.