ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ వద్ద వార్ 2 జస్ట్ యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఈ సినిమా హిట్ అని కాలర్ ఎగరేశాడు. ఒకటి కాదు డబుల్ కాలర్ ఎగరేశాడు. కానీ ఆయన ఎక్స్ పెక్టేషన్స్ నిజం కాలేదు. గతంలో దేవర సినిమాకు కూడా ఇలాగే ఎన్టీఆర్ కాలర్ ఎగరేశాడు అదీ అంతే అయ్యింది. ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తే బ్యాడ్ అనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జూన్ 25న డ్రాగన్ సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి అనుకున్నాడు యంగ్ టైగర్. ఇది మైథలాజికల్ స్టోరీతో రూపొందే భారీ చిత్రం. ఈ సినిమా టాలీవుడ్ నుంచి వచ్చే మరో ప్రెస్టీజియస్ మూవీ కానుంది.




















