“అఖండ 2” – ఈ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న కొత్త మూవీ అఖండ 2. ఈ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే కాస్త టైమ్ తీసుకునే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ చేయాలనేది దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయమై ఆలోచిస్తున్నారట. అంతా కన్ ఫర్మ్ అయిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. అఖండ 2 సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ని ఎంపిక చేశారట బోయపాటి. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి ఈ సాంగ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.