అల్లు అర్జున్, అట్లీ మూవీలో శివగామి

అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఓ పవర్ ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ నటిస్తుందట. అల్లు అట్లీ మూవీలో రమ్యకృష్ణ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని అంటున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక పదుకోన్ నటిస్తుండగా..మరో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, వారిని త్వరలో ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ సినిమాని కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఓ కొత్త తరహా కథాంశంతో రూపొందిస్తున్న ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. కుదిరితే 2026 ఎండింగ్ లో లేదంటే 2027లో రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.