“ఎస్ఎస్ఎంబీ 29” – వైరల్ గా మారిన అప్డేట్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికాకు త్వరలో టీమ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. బర్త్ డే విశెస్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో మహేశ్ వేసుకున్న లాకెట్ మాత్రమే చూపించారు.

నవంబర్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తో పాటు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారట. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ విషయంలో ఓ అప్డేట్ వైరల్ గా మారింది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ టైమ్ లో జేమ్స్ కామెరూన్ ఈ సినిమాలు చూసి రాజమౌళిని ప్రశంసించాడు. హాలీవుడ్ లో సినిమా చేయమని ప్రోత్సహించాడు. ఈ రిలేషన్ తోనే జేమ్స్ కామెరూన్ తో ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయించాలని అనుకుంటున్నారట.