రేపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రేపు మెగా 157 సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ ఉన్నందున ఈ రోజే విశ్వంభర అప్డేట్ ఇచ్చారు. ఉదయం చిరంజీవి చెప్పినట్లే సమ్మర్ లో ఈ సినిమా విడుదలకు తీసుకురాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతోంది.
ఈ సినిమా మెగా బ్లాస్ట్ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే – తన స్వార్థం కోసం ఒక వ్యక్తి చేసే యుద్ధానికి బలవుతున్న ప్రజలు తమను ఆదుకునేందుకు వచ్చే అతని కోసం వేచి చూస్తుంటారు. ఆ యుద్ధాన్ని యుగయుగాలు చెప్పుకునేలా ముగించే వీరుడి కోసం ఆ తెగ ఎదురుచూస్తుంటుంది. ఆ వీరుడి ఆగమనం, చేసే పోరాటంతో మెగా బ్లాస్ట్ గ్లింప్స్ కట్ చేశారు. ఎంత గ్రాండ్ స్కేల్ లో విశ్వంభర రూపొందుతోందో ఈ మెగా బ్లాస్ట్ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.




















