ఆ టార్గెట్ పెట్టుకున్న “ఓజీ”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజిత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ భారీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ కు ఏర్పడిన క్రేజ్ ను అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అవుతున్నారు.

ఈ నెల 29 నుంచి టిక్కెట్ సేల్స్ స్టార్ట్ చేస్తున్నారట. ఓవర్ సీస్ లో ప్రీ సేల్స్ ద్వారా 2 మిలియన్ డాలర్స్ వసూళ్లు టార్గెట్ గా పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఓజీ మూవీకి బాగా క్రేజ్ ఉంది. అందుచేత పక్కా ప్లాన్ ప్రకారం అడ్వాన్స్ సేల్స్ స్టార్ట్ చేస్తే ప్రీమియర్స్ టైమ్ కి 2 మిలియన్ టార్గెట్ అందుకోవడం కష్టమేమీ కాదు. త్వరలోనే ఓజీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయబోతున్నారు.