ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులను ఒక మైకం కమ్మేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తడబడటం, తప్పటడుగులు వేయడం, సతమతమై మతిచెడటం వంటివన్నీ ప్రేమికుల్లో జరుగుతుంటాయి. ప్రేమికులు ఎదుర్కొనే ఇవన్నీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీలోని ఏం జరుగుతుంది పాటలో అందంగా చేర్చారు. ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేసిన ఏం జరుగుతోంది పాట ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ అందించారు. లవర్స్ బాగా రిలేట్ చేసుకుని వెంటనే కనెక్ట్ అయ్యేలా ఏం జరుగుతోంది పాటను రూపొందించారు.
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.




















