రజినీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రజినీ ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నారు. ఇంతలో రజినీకాంత్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో మూవీ చేయబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. ఇందులో నిజమెంతో చూస్తే..ఆ మధ్య బాబీ, వశిష్ఠ్, వివేక్ ఆత్రేయ వంటి తెలుగు డైరెక్టర్స్ రజినీతో మూవీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కలేదు.
ఇటీవల రజినీకి నాగ్ అశ్విన్ స్టోరీ ఐడియా చెప్పాడట. ఈ ఐడియాకి రజినీ బాగుందని.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వైజయంతీ సంస్థలో గతంలో రజినీకాంత్ నటించాడు. ఈ రిలేషన్ తోనే ఈ సంస్థకు మూవీ చేయడానికి రజినీ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి 2 చేయాల్సిఉంది.




















