ప్లెజెంట్ డ్యూయెట్ లో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాటను థమన్ క్లాస్ గా కంపోజ్ చేశారు. శృతి రంజన్ అంతే క్లాస్ గా పాడారు. ఓజీ లాంటి ఫైర్ స్ట్రామ్ మూవీలో ఇంత క్లాస్ డ్యూయెట్ పెట్టడం కొత్త ప్రయత్నమే. పవన్ ఇలాంటి ప్లెజెంట్ డ్యూయెట్ లో చాలా రోజుల తర్వాత కనిపించారు.

ప్రియాంక మోహన్, పవన్ మధ్య సువ్వి సువ్వి పాటను అందంగా చిత్రీకరించారు. ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కనిపించనున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.