బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సిఉంది. అయితే వీఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కానందున అఖండ 2 సినిమా విడుదల వాయదా వేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. గతంలో హిట్ అయిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను దర్శకుడు బోయపాటి రూపొందిస్తున్నారు.
అఖండ 2 రిలీజ్ వాయిదాతో అదే రోజున రిలీజ్ కు వస్తున్న ఓజీ సినిమాకు లైన్ క్లియర్ అయ్యినట్లయింది. పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25నే థియేటర్స్ లోకి వస్తుంది. అఖండ 2 వర్సెస్ ఓజీ అనే పోటీ బాక్సాఫీస్ వద్ద నెలకొంది. ఇప్పుడు సోలో రిలీజ్ తో ఓజీ మరిన్ని భారీ వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి.




















