జనవరి 9న “రాజా సాబ్” రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్ రిలీజ్ డేట్ పై ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మిరాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్ పై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో రాజా సాబ్ సంక్రాంతి రేస్ కన్ఫర్మ్ అయ్యింది. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీ మూవీగా రాజా సాబ్ తెరకెక్కుతోంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ మూవీ చేస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి రిలీజ్ కాబట్టి రాజా సాబ్ కు బాక్సాఫీస్ వద్ద మరింత భారీ స్కేల్ లో కలెక్షన్స్ దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు సంక్రాంతికి చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు సినిమా కూడా రిలీజ్ కు రాబోతోంది.