యాక్షన్, హింసతో పెరిగిపోయిన ఎ సర్టిఫికెట్ మూవీస్ ట్రెండ్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో సకుటుంబంగా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తోంది లిటిల్ హార్ట్స్ మూవీ. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుందీ మూవీ. సెప్టెంబర్ 5న ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు లిటిల్ హార్ట్స్ మూవీ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ చిత్రంలో రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు.




















