మెగా ఫ్యామిలీలో విషాధం నెలకొంది. అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నిర్వహించనున్నారు. అల్లు కనకరత్నం మృతి వార్త తెలుసుకున్న చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సతీమణితో కలిసి వచ్చారు.
అల్లు కనకరత్నం మృతి పట్ల చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేశారు. మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.




















