
Coriander: నేటి కాలంలో చాలామంది కలుషితమైన ఆహారం తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో కిడ్నీ సమస్యలు ఒకటి. చాలామంది కిడ్నీ రాళ్ల సమస్యలతో విసిగిపోతున్నారు ఎన్నో రకాల మందులు వాడినప్పటికీ ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే ఇంట్లో ఉండే వస్తువుతోనే కిడ్నీ రాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ రాళ్ల సమస్యలకు కొత్తిమీర మంచి పోషకాహారం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. కొత్తిమీరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తంలో ఉండే చక్కర స్థాయిలను పూర్తిగా తగ్గిస్తాయి. Coriander
Coriander Leaves Benefits for human life
కొత్తిమీర తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇందులోని విటమిన్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొత్తిమీరలో విటమిన్లు ఉండడం వల్ల ఇది కళ్ళ సమస్యలను పూర్తిగా నివారిస్తుంది. కంటి కింద నల్లటి వలయాలను పోగొడుతుంది. ప్రతిరోజు కొత్తిమీరను తినడం వల్ల కిడ్నీలో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి. కొత్తిమీర తినడం వల్ల ఒంట్లో ఉండే వేడి పూర్తిగా తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. పేగులు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు కొత్తిమీర జ్యూస్ ప్రతి రోజు ఉదయం పూట తగినట్లయితే సమస్య తొందరగా తొలగిపోతుంది.Coriander
Also Read: Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్…
కొత్తిమీర నరాలకు, కాలేయానికి, ఊపిరితిత్తులకు ఎంతగానో సహాయం చేస్తుంది. కొత్తిమీర తినడం వల్ల నోటి పూత తొలగిపోతుంది. మూత్రపిండాల్లో రాళ్లు వేగంగా కరిగిపోతాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల గుండె జబ్బుల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇది మానసిక ఒత్తిడిని అధికంగా తగ్గిస్తుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాలు తొలగిపోతాయి. ఇది అధిక పోషకాలతో నిండి ఉన్న ఆహారం ఆ కారణంగా ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి కొత్తిమీర జ్యూస్ చాలా మంచిది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఉదయం పూట కొత్తిమీర జ్యూస్ ఒక గ్లాసుడు తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యులు సూచనలు చేస్తున్నారు. డైట్ ఫాలో అయ్యేవరకు కూడా కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల వారి ఆరోగ్యం బాగుంటుంది. Coriander
Also Read: Sana Mir Azad Kashmir: అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. సనా మిర్ వివాదం ఏంటీ…




















