
Kantara Chapter 1: కాంతార చాప్టర్ వన్ సినిమా దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు అనగా అక్టోబర్ 2న దసరా బరిలో నిలిచింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తో పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అలా రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా మంచి మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటించిన మరొకరికి కూడా సినిమా హిట్ క్రెడిట్ దక్కుతుంది.
The beauty who missed her chance as a heroine in Kantara Chapter 1
ఆమెనే హీరోయిన్ రుక్మిణి వసంత్.. సినిమా హిట్ అవ్వాలంటే హీరో తో పాటు విలన్,హీరోయిన్ కూడా ఉంటేనే సినిమా పూర్తి హిట్ అవుతుంది. అలా కాంతార సినిమాలో రుక్మిణి వసంత్ పాత్రకి చాలామంది ఫిదా అయిపోయారు. అంతేకాదు ఆమె అందం నటనతో ఈ సినిమాకి ప్లస్ అయింది.అయితే ఈ సినిమాలో మొదట రుక్మిణి వసంత్ కాకుండా మరో హీరోయిన్ ని ఎంచుకున్నారట.(Kantara Chapter 1)
Also Read: Rashmika: రష్మిక పరువు తీసిన కాంతార బ్యూటీ.. టవల్లో చెప్పు పెట్టి కొట్టినట్లు.!
కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో రుక్మిణి వసంత్ కి ఆ అవకాశం దక్కిందట. మరి ఇంతకీ కాంతార చాప్టర్ వన్ సినిమాలో హీరోయిన్ పాత్రని రిజెక్ట్ చేసిన ఆ ముద్దుగుమ్మ ఎవరయ్యా అంటే శ్రీలీల.మొదటి ఈ అవకాశం కొంతమంది సీనియర్ హీరోయిన్లతో పాటు శ్రీలీల దగ్గరికి కూడా వచ్చిందట. కానీ శ్రీలీల ఈ సినిమాలో సీరియస్ పాత్ర నాకు సెట్ అవ్వదని రిజెక్ట్ చేసిందట.

అలా శ్రీలీల రిజెక్ట్ చేయడంతో రుక్మిణి వసంత్ ని హీరోయిన్గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ కాంతార చాప్టర్ వన్ సినిమాలో మాత్రం రుక్మిణి వసంత్ తన అందంతో దక్షిణాదిని మాత్రమే కాదు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ తో రుక్మిణి వసంత్ కి తిరుగే ఉండదు అంటున్నారు ఆమె అభిమానులు.(Kantara Chapter 1)




















