
Prabhas: సినిమా ఇండస్ట్రీ వారు ఎంత అప్డేట్ గా ఉంటారో సెంటిమెంట్ కూడా అంతే ఫాలో అవుతారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వారికి సెంటిమెంట్లపై ఎక్కువ మక్కువ ఉంటుంది.. తాజాగా ప్రభాస్ విషయంలో కూడా ఒక సెంటిమెంటు బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ తాజాగా నటించిన ది రాజా సాబ్ మూవీ 2026 జనవరి 9న గ్రాండ్గా విడుదలవబోతోంది.
Prabhas Raja Saab is a disaster
అయితే ఈ సినిమా ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ పలుమార్లు వాయిదా పడుతూ చివరికి జనవరి 9న డేట్ ఫిక్స్ చేశారుఈ సినిమాకు సంబంధించి 80% షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఇప్పటికే సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరు డైరెక్టర్ పై హీరో పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ట్రైలర్ చూసిన జనాలు కూడా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.(Prabhas)
Also Read: Abhishek Bachchan: నీతో పడుకుంటా అంటూ హీరోయిన్ ని పచ్చిగా అడిగేసిన అభిషేక్ బచ్చన్.!
కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ చాలా సినిమాల్లో ఆ ఒక్క సెంటిమెంట్ రిపీట్ కావడం వల్లే ప్రభాస్ రాజా సాబ్ మూవీ డిజాస్టర్ అవుతుందంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటి అనే వివరాలు చూద్దాం.. ప్రభాస్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో R అనే అక్షరంతో సినిమా వస్తే ఆ మూవీ తప్పకుండా ఫ్లాపే అవుతుంది. అయితే ప్రభాస్ నటించిన రాధే శ్యాం,రెబల్, రాఘవేంద్ర ఈ మూడు సినిమాల్లో ఇంగ్లీషులో మొదట ఆర్ లెటర్ తోనే ప్రారంభమయ్యాయి.

ఈ లెటర్ తో ప్రారంభం అవ్వడం వల్ల ఆ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఇదే తరుణంలో రాజా సాబ్ మూవీ కూడా R లెటర్ తోనే ప్రారంభమైందని ఇది కూడా ఫెయిల్ అవుతుందని అభిమానులు భయపడుతున్నారు. అయితే మరికొంతమంది అభిమానులు ఏమో అది ఆర్ తో ప్రారంభం కాలేదు రాజా సాబ్ ముందు ది రాజా సాబ్ అని ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఈ చిత్రం హిట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా త్వరలో తెలియబోతోంది.(Prabhas)




















