Ponnam Prabhakar: అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ దున్న‌పోతు..పొన్నం ప్ర‌భాక‌ర్ రాజీనామా ?

Ponnam Prabhakar: తెలంగాణ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తోటి మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ను దున్నపోతు అంటూ వ్యాఖ్యానించారు పొన్నం ప్రభాకర్. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ను పట్టుకొని దున్నపోతు అనడంపై మాదిగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు కూడా రంగంలోకి దిగారు. పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Ponnam Prabhakar Adluri Laxman Kumar controversy

పొన్నం ప్రభాకర్ తోటి మంత్రిని పట్టుకొని ఇలా దున్నపోతు అన్నాడు అంటే ప్రజలతో ఎలా మాట్లాడుతారు? అని నిల‌దీశారు. పొన్నం ప్రభాకర్ దున్నపోతు అన్నందుకు అడ్లురి లక్ష్మణ్ నాముందే కన్నీళ్లు పెట్టుకున్నాడని ఎమోష‌న‌ల్ అయ్యారు. దళిత బిడ్డను పట్టుకొని దున్నపోతు అనడం చాలా బాధాకరం అని ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్‌కు దళితులు అంటే అంత చులకన భావం ఉండటం అనేది కరెక్ట్ కాదని ఆగ్రహించారు. అడ్లూరి లక్ష్మణ్‌ను దున్నపోతు అని అనే అంత అవసరం ఏం వచ్చిందని నిల‌దీశారు.

Also Read: Balayya: బాలయ్యకు ఎల్లో మీడియా వెన్నుపోటు…ఇక ఒంటరివాడు కానున్నాడా?

3:30 లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెట్టుకుంటే పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి అర గంట ముందే 3 గంటలకే పోయి లక్ష్మణ్ రాలేదు దున్నపోతు అనే అవసరం ఏముంది అని ప్ర‌శ్నించారు. మీరు నిజంగా అన్నారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలి.. మీరు అనకపోతే లక్ష్మణ్ బాధపడర‌న్నారు మోత్కుపల్లి నరసింహులు. నిన్న లక్ష్మణ్ నా ముందు గంట సేపు బాధ పడ్డాడని బాంబ్ పేల్చారు కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు.

Also Read: Salt: మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ప్ర‌మాద‌మేనా..ఇవి తెలుసుకోండి?