Raashii Khanna: అతనితో ప్రేమలో ఉన్నానంటూ నిజం ఒప్పుకున్న రాశి ఖన్నా..!

Raashii Khanna: టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ల లిస్టులో రాశి ఖన్నా కూడా ఉండేది. ఇప్పుడు కూడా ఆమె సినిమాలతో ఫుల్ బిజీగానే ఉంది. తెలుగులోనే కాకుండా తమిళ్

Raashii Khanna confessed that she was in love with him

Raashii Khanna: టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ల లిస్టులో రాశి ఖన్నా కూడా ఉండేది. ఇప్పుడు కూడా ఆమె సినిమాలతో ఫుల్ బిజీగానే ఉంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా తన సత్తా చూపుతోంది.. అలాంటి రాశి ఖన్నా తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి లతో కలిసి తెలుసు కదా అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు.

Raashii Khanna confessed that she was in love with him

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాశి ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను బయటపెట్టింది.. ఇందులో ముఖ్యంగా తన లైఫ్ లోని లవ్ స్టోరీలను తెలియజేసింది. అయితే రాశి ఖన్నా రెండుసార్లు ప్రేమలో పడ్డానని, సినిమాల్లోకి రాకముందు ఒకసారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరోసారి లవ్లో పడ్డానని తెలియజేసింది..(Raashii Khanna)

Also Read: Siddu Jonnalagadda: నేను పెళ్లి చేసుకోను.. కానీ తమ్ముడి పెళ్లి ఆ హీరోయిన్ తో.. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు…

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుందని, నాకు కూడా అందరిలాగే ప్రేమానురాగాలు ఉన్నాయని తెలియజేసింది.. అయితే రాశి ఖన్నా ప్రేమిస్తుంది ఎవర్ని అనేది మాత్రం బయటపెట్టలేదు. కానీ తాను మాత్రం ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పేసింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ గురించి కాస్త హింట్ ఇవ్వడంతో రకరకాల పేర్లు కామెంట్లు చేస్తూ రాశిఖన్నా ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Raashii Khanna confessed that she was in love with him

ఇక తెలుసు కదా సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేస్ లో సినిమా రూపొందినట్లు సమాచారం. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.(Raashii Khanna)