Rohit Sharma Lamborghini: భారీ సిక్సర్ కొట్టిన రోహిత్ శర్మ..కారు ధ్వంసం

Rohit Sharma Lamborghini : వన్డే కెపెన్సి కోల్పోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. ముంబైలోని శివాజీ పార్క్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు రోహిత్ శర్మ. నిన్న శుక్రవారం రోజున మంచి వారం కావడంతో బ్యాట్ పట్టుకున్నాడు. నేరుగా ముంబైలోని శివాజీ పార్క్ వెళ్లి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు చెమటోడ్చాడు రోహిత్ శర్మ. అతి త్వరలోనే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేశాడు. అయితే ఈ ప్రాక్టీస్ సందర్భంగా దుమ్ము లేపే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు రోహిత్ శర్మ. సిక్స్ లు అలాగే బౌండరీలు కొట్టి ఆకట్టుకున్నాడు. అయితే ఆయన కొట్టిన ఓ సిక్సర్ కొంప ముంచింది. Rohit Sharma Lamborghini

Rohit Sharma hit that six, it went straight and landed on his own Lamborghini

తన రెడ్ కలర్ లంబోర్ఘిని కారుకు రోహిత్ శర్మ కొట్టిన బంతి తగిలింది. లెగ్ సైడ్ భారీ షాట్ ఆడడంతో నేరుగా వెళ్లి ఆ కారుకు తగిలింది బంతి. దీంతో కారు అద్దాలు పగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కారు ధర దాదాపు 4.57 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా రోహిత్‌ శర్మ ఉలిక్కిపడ్డాడు. అయ్యో నా కారుని నేను కొట్టుకున్నానా ? అంటూ తల పట్టుకున్నాడు. Rohit Sharma Lamborghini

Also Read: TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఇప్పటినుంచే రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఈ సిరీస్లో సాధారణ ప్లేయర్ గానే రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడు. అతని కెప్టెన్సీ నీ తొలగించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి , కుర్ర ఆటగాడు గిల్ కు అవకాశం ఇచ్చింది. అంటే అతని కెప్టెన్సీలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ ఆడబోతున్నారన్నమాట. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇస్తాడని అంటున్నారు. Rohit Sharma Lamborghini

ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ బాటలోనే విరాట్ కోహ్లీ నడవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను కూడా చాలా రోజులుగా వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తాను కూడా ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్టులు అలాగే t20 లకు ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత‌ బొంతు రామ్మోహన్.. సరైన