
NTR: ఎన్టీఆర్ బావమరిది నటుడు నార్నె నితిన్ పెళ్లి రీసెంట్ గా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ పెళ్లి వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో తాజాగా నార్నె నితిన్ పెళ్లికి ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.
NTR gave a costly gift for his brother-in-law wedding
ఇక నార్నె నితిన్ శివానీల పెళ్లిని ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతి ఇద్దరు దగ్గరుండి చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఏ వీడియో ఫోటో చూసినా కూడా అందులో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలే కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ పెళ్లిలో అందరికంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వీరే కనిపించారు. క్రీమ్ కలర్ కుర్తాలో ఎన్టీఆర్,క్రీమ్ కలర్ శారీలో లక్ష్మీ ప్రణతి అద్భుతంగా కనిపించారు.(NTR)
Also Read: Allu Arjun: రాత్రికి రాత్రే షాకింగ్ నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీతో ఇక కలిసేదేలే.!
అంతేకాదు లక్ష్మీ ప్రణతి అచ్చం అప్సరసలాగే కనిపిస్తోంది. అయితే ఈ పెళ్లికి ఎన్టీఆర్ బావమరిది నితిన్ కి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే బామ్మర్దికి ఎంతో ఇష్టమైన ఒక స్పెషల్ లగ్జరీ కారుని ఆయనకు నచ్చిన విధంగా డిజైన్ చేయించి స్పెషల్గా ఫారిన్ నుండి తెప్పించారట.

ఇక ఆ స్పెషల్ కారు విలువ ఏకంగా రెండు కోట్లకు పైగానే అని తెలుస్తుంది. అలా బామ్మర్ది పెళ్ళికి ఆయనకిష్టమైన లగ్జరీ కారు ని ఎన్టీఆర్ గిఫ్టుగా ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఎన్టీఆర్ కి బావమరిది అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.(NTR)




















