Vivek vs Adluri Lakshman: కాంగ్రెస్ లో మరో పంచాయతీ… వివేక్ వర్సెస్ లక్ష్మణ్.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు ?

Vivek vs Adluri Lakshman: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలోనే దున్నపోతు వ్యవహారం రాజుకున్న సంగతి తెలిసిందే. దళిత మంత్రి అడ్లూరి లక్ష్మన్ ను దున్నపోతు అన్నందుకు పొన్నం ప్రభాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ సంఘటన నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ కూడా దిగివచ్చి క్షమాపణలు చెప్పేశారు. ఇలాంటి నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ పై వి6 వివేక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Vivek vs Adluri Lakshman

Vivek Venkataswamy vs Adluri Lakshman

అనవసరంగా తనను దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆ దున్నపోతు వ్యవహారంలో తనను టార్గెట్ చేస్తున్నారని నిప్పులు చె రిగారు. తన తండ్రి కాక వెంకటస్వామి వల్ల అడ్లూరి లక్ష్మణ్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వి6 వివేక్ వెంక‌ట‌స్వామి తన పేరు తీసి మాట్లాడడం అత్యంత బాధాకరమని ఫైర్ అయ్యారు. Vivek vs Adluri Lakshman

Also Read: Tollywood: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ..రంగంలోకి రేవంత్ స‌ర్కార్?

నేను ఒకటే పార్టీకి అలాగే ఒకటే జెండాకు కట్టిబడి ఉంటా, పార్టీ లైన్ దాటి ప్రవర్తించ బోనని తేల్చి చెప్పారు. మా మధ్యలో ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని చురకలు అంటించారు. వివేక్ మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకు అలాగే మర్యాదకు గౌరవానికి వదిలేస్తున్నానని ఫైర్ అయ్యారు. అంటే వి6 వివేక్ పదేపదే పార్టీలు మారతాడని, దాని అసలు సిసలు కాంగ్రెస్ వాదిని అంటూ చెప్పే ప్రయత్నం చేశారు అడ్లూరి లక్ష్మణ్.

Also Read: Green Tea: ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే ?