
Bandla Ganesh: ఎప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉండే నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అది బండ్ల గణేష్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఎలాంటి ట్వీట్ పెడతారో ఎవరూ ఊహించలేరు. పవన్ కళ్యాణ్ ని తన దేవుడు అంటారు. కానీ ఆయన పైనే సెటైర్లు వేస్తారు. అలా ఎప్పుడూ ఏం మాట్లాడుతారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే అలాంటి బండ్ల గణేష్ తాజాగా ఓ నిర్మాతకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Bandla Ganesh counter to the producer
అది పీకుతా ఇది పీకుతా అని అనడం మాములే. మనం చేసేదేమీ లేదు.ఎందుకంటే మాటలు మన చేతుల్లో ఉంటాయి. కానీ రిజల్ట్ ఏంటి ఆట ఎవరిది అనేది ఆ జనాలే తీర్పిస్తారు అంటూ ఒక వివాదాస్పద ట్వీట్ పెట్టారు.అయితే ఈ ట్వీట్ నిర్మాత బన్నీ వాసు కి కౌంటర్ గా పెట్టినట్టు తెలుస్తోంది. దానికి కారణం రీసెంట్గా లిటిల్ హార్ట్స్ మూవీ సమయంలో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలే.(Bandla Ganesh)
Also Read: Ram Pothineni: ఒంటరిగా ఉంటూ ఎఫైర్స్.. రామ్ పోతినేని పరువు తీసిన హీరో.!
ఆయన అలా మాట్లాడటంతో చాలామంది అసహనానికి గురయ్యారు.ముఖ్యంగా ఈ విషయం గురించి తాజాగా మిత్రమండలి ప్రమోషన్ లో కూడా బన్నీ వాసు స్పందించి.. ఆయన అలా మాట్లాడి ఉండకూడదు అంటూ చెప్పారు.అయితే బన్నీ వాసు మాట్లాడిన మాటల్ని గుర్తుపెట్టుకున్న బండ్ల గణేష్ తాజాగా మిత్రమండలి సినిమా గురించి బన్నీ వాసు కొట్టుకున్న డబ్బా గురించి సెటైర్ వేశారు.

ఎందుకంటే మిత్రమండలి సినిమా బాగుంటుందని, అలాగే తన సినిమాపై నెగటివ్గా ట్రోల్స్ చేస్తున్నారని, నాపై ట్రోల్స్ చేసేవారు వెంట్రుక కూడా పీకలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలకి తాజాగా కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్.(Bandla Ganesh)




















