
IPL: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ వచ్చే సంవత్సరం మార్చి 15 తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ లలో మొత్తం 84 మ్యాచులు జరుగుతాయి. ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ కన్నా ముందు ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుంచి 15 మధ్యలో మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో కొంతమంది ప్లేయర్లను జట్టు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ విలువ మరోసారి రెండో ఏడాది కూడా భారీగా పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్ల విలువ ఉంది. 2024 సీజన్ నాటికి రూ.82,700 కోట్లకు తగ్గింది. IPL
IPL system suffers loss of Rs. 6600 crores
2025లో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గత సంవత్సరంతో పోల్చినట్లయితే 80% డ్రాప్ నమోదు అయింది. స్పాన్సర్స్ గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. టీవీని డిజిటల్ ఓవర్టేక్ చేయడం ఇలాంటి తదితర అంశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. 2025 ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆర్సిబి జట్టు విజయం సాధించింది. 18 సంవత్సరాల అనంతరం ఆర్సిబి జట్టు ఐపీఎల్ కప్పు గెలిచింది. ఈ సందర్భంగా కోట్లాది సంఖ్యలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. IPL
Also Read: Jagan: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం…రాజకీయాల్లోకి జగన్ కూతురు ?
ఆ సంబరాలలో భాగంగా కొంతమంది వారి ప్రాణాలను సైతం కోల్పోయారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఇందులో కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా, 2026 ఐపీఎల్ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీ తన ఆటను ఆడతారో లేదో చూడాలి. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్టులు, టీ20 లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి ఐపీఎల్ మ్యాచ్లను ఆడతారో లేదో అనే సందేహంలో వారి అభిమానులు ఉన్నారు. తప్పకుండా వీరు ఐపీఎల్ మ్యాచ్లను ఆడాల్సిందేనని అంటున్నారు. ఈ విషయం పైన త్వరలోనే క్లారిటీ రానుంది. IPL
Also Read: Diwali 2025 : దీపావళి నాడు ఇలా పూజలు చేస్తే, అరిష్టమే..ఇవి తెలుసుకోండి ?




















