Anirudh Reddy: తెలంగాణ సీఎంగా అనిరుధ్ రెడ్డి?

Anirudh Reddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ మంత్రుల మధ్య వివాదాలు వరుసగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో కొండా సురేఖ అంశం హాట్ టాపిక్ అయింది. పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ మధ్య వారు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బాంబు పేల్చారు సుస్మిత. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరో బాబు పేల్చాడు. తాను కూడా సీఎం అవుతాను అంటూ తేల్చి చెప్పాడు. Anirudh Reddy

Anirudh Reddy as Telangana CM

ఇప్పటికే ముఖ్యమంత్రి సీట్ కోసం సీనియర్ నాయకులు అందరూ పోటీ పడుతుంటే, ఉన్న సీటును కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తన కెరీర్ లో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, తాను కూడా ముఖ్యమంత్రి అవుతానంటూ ప్రకటించేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సొంత ప్రభుత్వం పై తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రుల జిల్లాలు , వారి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి.. తమకు మాత్రం అన్యాయం జరుగుతోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెల్లడించారు. Anirudh Reddy

Also Read: Komatireddy Rajgopal Reddy: ఆస్తులు అమ్ముకున్నా.. కాంగ్రెస్ పై రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో బాంబ్…

ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం అయ్యేది అంటూ ఫైర్ అయ్యారు. ఇంకో రెండుసార్లు గెలిపించండి, నేను కూడా సీఎం అభ్యర్థి అవుతానని అనిరుద్ రెడ్డి వెల్లడించారు. అయితే ఈయన వ్యాఖ్యల నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే సీఎం అవుతానని ప్రకటిస్తున్నావు.. మల్లోసారి నీ నియోజకవర్గంలో గెలిచి చూపించు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు గులాబీ సోషల్ మీడియా ప్రతినిధులు. Anirudh Reddy

Also Read: ponnam prabhakar: పొన్నం ప్రభాకర్ ఒక్కడుంటే చాలు.. కాంగ్రెస్ రెండు నిమిషాల్లో భూస్థాపితం ?