
Salt: హిందూ సాంస్కృతిలో వాస్తు నియమాలను ఎక్కువగా పాటిస్తారు. ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి ఏ మొక్కను ఎక్కడ నాటాలి అనే విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. హిందువులు ఎక్కువగా వాస్తు నియమాలను పాటిస్తారు. దానివల్ల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇక వంట గదిలో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి అనే దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. ఉప్పు నూనె పసుపు లాంటి వస్తువులను ఏ దిశలో పెట్టాలి అని తప్పకుండా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఉప్పు విషయంలో చాలామంది జాగ్రత్తలు పాటిస్తారు. ఉప్పును ఇంట్లో సరైన దిశలో పెట్టినట్లయితేనే ఇంటికి చాలా మంచిది. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. Salt
Is salt only used in cooking
ఉప్పులేని వంటకాన్ని అసలు తినలేము. ఉప్పు ఆహారంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జీవితంలో అడ్డంకులు గొడవలు రాకుండా చేస్తుంది. ఉప్పు సానుకూలత సమతుల్యతలకు చిహ్నంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చాలా శక్తివంతమైనది. ఇది ఇల్లు, జీవితం పైన తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. ముఖ్యంగా ఇల్లు తుడుచుకునే సమయంలో ఉప్పు నీటితో నేలను తుడుచుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంటి మూలల్లో ఉప్పు గిన్నెలను పెట్టడం వల్ల చాలా మంచిది ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద ఉప్పు మూటను వేలాడదీయడం వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం ఉప్పును సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. అప్పుడే ఉప్పు చుట్టుపక్కల ఉండే శక్తులను గ్రహిస్తుంది. Salt
Also Read: Jowar Roti: రోజు జొన్న రొట్టె తింటున్నారా…అయితే జాగ్రత్త
ఉప్పు చంద్రుడు, శనితో సంబంధం కలిగి ఉంటుంది. ఉప్పును సరైన దిశలో నిలువ చేస్తే అది శుభశక్తులను తీసుకువస్తుంది. ఉప్పును ఎల్లప్పుడూ గాజు, సిరామిక్ లేదా ఉక్కు మూత ఉన్న పాత్రలో నిల్వ చేయాలని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంటికి సంతోషం ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది. అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే ఉప్పును నిలువ చేసే సమయంలో ఇనుము లేదా అల్యూమినియం పాత్రలో ఉప్పును నిల్వ చేయడం మంచిది కాదు. ఇది అనేక రకాల ఘర్షణలు, అనారోగ్యం, నష్టాలు తీసుకువస్తాయి. దానివల్ల ఇంట్లో సంపద నశిస్తుంది అనారోగ్యం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. ఉప్పును ఎల్లప్పుడూ గాజు సీసాలలో లేదా ప్లాస్టిక్ డబ్బాలలో మాత్రమే నిల్వ చేయాలి. దాని వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. Salt
Also Read: Drinking Water: నీళ్లు నిలబడి తాగితే, ప్రమాదమేనా..అయితే ఇవి తెలుసుకోండి?




















